మహేశ్వరం : తెలంగాణ రాష్ర్టానికి పొరు గు దేశాల నుంచి పెట్టుబడులు రావడం అభినందనీయమని చేవేళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలోని తుమ్ములూరులో మ్యాక్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కెనడా ఉడ్ విల్లాస్ను కెనడా వాణిజ్య శాఖ మంత్రి ఆండ్య్రు స్మిత్, కెనడా హై కమిషన్ శ్రీ ప్రానేష్ చిబ్బర్తో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ, దేశంలో రాబో యే రోజుల్లో చెక్కతో కూడిన ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఇతర దేశాలలో కంటే ఎక్కువగా తెలంగాణలో మొక్కల పెంపకాన్ని ప్రభు త్వం ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. వందశాతం కెనడా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి కెనడా వాణిజ్య శాఖ మంత్రి కృషిచేస్తున్నారని ఆయన అన్నారు.
మ్యా క్స్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్లోని నాలెడ్జ్ సిటీ నడిబొడ్డును 250 ఎకరాలలో విస్తరించి ఉన్న బీటీఆర్ గ్రీన్స్ విస్తారమైన ప్రపంచ స్థాయి గేటెడ్ కమ్యూనిటీలో భాగంగా ఉన్నాయని ఆయన అన్నారు. 300 ప్రీమి యం విల్లాలతో కూడిన ఈప్రాజెక్టు నగర జీవనానికి సంబంధించి ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని లగ్జరీలతో ఎంతో ఆకర్షణీయంగా విభిన్న శైలిలో నిర్మాణాలు జరుగుతాయని ఆయన అన్నారు. కెనడా పెట్టుబడులు తెలంగాణకు రావడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. కాంక్రీట్, ఉక్కుతో పోలిస్తే.. వేడి, చలిని తట్టుకోవడంలోనూ కలప అనేది కాంక్రీటు కంటె 15 రెట్లు, ఉక్కు కంటె 400 రెట్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మ్యా క్స్ ప్రాజెక్టు అధికార్లు నవాబ్ మీర్ నాజిర్ అలీ ఖాన్ ఇతర ఆర్కిటెక్ట్లు తదితరులు పాల్గొన్నారు.