రవీంద్రభారతి, సెప్టెంబర్ 3: పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే ఉపకా ర వేతనాలను తక్షణమే పెంచాలని, ఈ డిమాండ్ న్యాయ సమ్మతమేనని, విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కూడా పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు, ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవీంద్రభారతిలోని మెయి న్ హాల్లో బీసీ విద్యార్థి రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల సదస్సును మంగళవారం నిర్వహించారు. సభకు బీసీ విద్యార్థి సంఘం నాయకుడు వేముల రామకృష్ణ అధ్యక్షత వ హించగా, కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య, ఎ మ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎంపీ హనుమంతరావులు హాజరయ్యారు.
ఆర్.కృ ష్ణయ్య మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ విద్యార్థులకు రెండేళ్ళుగా బకాయి ఉన్న రూ.4.500 కోట్ల ఫీజులను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.1500 నుంచి 3000లకు పెంచాలని, డే స్కాలర్షిప్స్ను ఇంటర్, డిగ్రీ కోర్సులకు రూ.10 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి విదేశీ విద్యానిధి మంజూరు చేయాలన్నారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లను ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.
ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ ఇంటర్ తదితర విద్యార్థుల మొత్తం ఫీజులు పునరుద్ధరించాలని ఆర్.కృష్ణయ్య డి మాండ్ చేశారు. కాలేజీ హాస్టళ్ళు అద్దె భవనా ల్లో కొనసాగుతున్నాయని, వాటికి సొంత భవనాలు నిర్మించాలన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే ఉపకార వే తనాలు సరిపోవడం లేదని, తక్షణమే వాటిని పెంచాలని, ఈ డిమాండ్ న్యాయ సమ్మతమేనని తన వంతు బాధ్యతగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉందని మీ సమస్యల ను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ నేత ఎన్.వెంకటేశ్, జి.సత్యం, నందగోపాల్, అంజి, రాజ్ కుమార్, మల్లేశ్ యాదవ్, రఘుపతి, రాములు యాదవ్, రా ఘవేంద్ర, సతీశ్, లక్ష్మినారాయణ, రామలిం గం, ప్రభాకర్, రాజు, కోటేశ్వరి పాల్గొన్నారు.