హైదరాబాద్: హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మదీనాలో పెను ప్రమాదం తప్పింది. పత్తర్గటి రోడ్డులో రన్నింగ్లో ఉన్న ఓ కారులో (Moving Car) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు రావడం గుర్తించిన డ్రైవర్ అందులోనుంచి దిగిపోయాడు. తర్వాత మంటలు కారుమొత్తం వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో అంతా క్షేమంగా బయటపడినట్లు తెలిపారు. కారులో మంటలు చెలరేగడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.