నంబర్ ప్లేట్ మారిస్తే వేటే!
వాహనదారులు.. నంబర్ ప్లేట్స్‌తో జరభద్రం.. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉంది.
- నిబంధనలకు విరుద్ధంగా
- బిగించిన వాహనాలపై కేసులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : వాహనదారులు.. నంబర్ ప్లేట్స్‌తో జరభద్రం.. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబర్ ప్లేట్లను తారుమారు చేసి పోలీసులకు చిక్కారు. పలువురిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆర్టీఏ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌తో నంబర్ ప్లేట్స్‌పై నిఘా పెట్టారు.
చాలా మంది ఇంగ్లిష్ అక్షరాలను పోలి ఉన్న అంకెలను అమర్చుకుంటున్నారు. మరికొందరు నంబర్లో ఒక అంకెను చెదరగొట్టి వాహనాలను తిప్పుతున్నారు. ఇంకొందరూ ఒకే నంబర్ ప్లేట్‌తో రెండు వాహనాలను నడుపుతున్నారు. ఇతర రాష్ట్ర వాహనాలు సైతం అనుమతి లేకున్నా ఇక్కటి నంబర్ ప్లేట్స్ తగిలించుకుని రాష్ట్రంలో తిప్పుతున్నారు.
ముఖ్యంగా వీకెండ్లు, పండుగల దద్దీ దృష్ట్యా వైట్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ప్రయాణికులను ఎక్కించుకుని ట్రిప్పులు కొడుతున్నట్టు ఆర్టీఏకు ఫిర్యాదులు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 27 వాహనాలపై రవాణా శాఖాధికారులు కేసులు నమోదు చేశారు. ఎంవీ యాక్ట్ 1989 ప్రకారం 50, 51 నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనాలు, లైట్ మోటార్ వెహికిల్ కార్లు రిజిస్ట్రేషన్ అంకెలు, అక్షరాలు కచ్చితంగా వైట్ ప్లేట్‌పై బ్లాక్ కలర్లో ఉండాలి.
కమర్షియల్ వాహనాలైతే ఎల్లో ప్లేట్‌పై బ్లాక్ లెటర్స్‌తో నంబర్ ఉండాలి. రిజిస్ట్రేషన్ నంబర్ రెండు వరుసల్లో ఉండాలి. స్టేట్ కోడ్ (టీజీ) అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ కోడ్ తర్వాత మిగిలిన నంబర్ రెండో వరుసలో ఉండాలి. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేస్తే వెహికిల్ వివరాలతో పాటు ఓనర్ డిటేయిల్స్ మొత్తం తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్స్ బిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

