హైదరాబాద్ : సృష్టికి జీవం పోసిన రెండు అక్షరాల దేవత అమ్మ అని, అలాంటి మాతృమూర్తిని ప్రతి ఒక్కరు తప్పకుండా నిరంతరం గౌరవించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా సనత్ నగర్ డివిజన్ బీకేగూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 250 మంది పేద మహిళలకు మంత్రి చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లి చూపే ప్రేమ వేల కట్టలేనిదన్నారు. మనకు జన్మనిచ్చిన తల్లికి ఎన్ని సేవలు చేసినా ఆమె ప్రేమ ముందు తక్కువేనని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పార్థసారథి, సభ్యులు రామమూర్తి, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.