‘నదికి జీవం పోయడం అంటే పేదల ఇళ్లను బుల్డోజర్లతో తొకించడం కాదు.. డీపీఆర్‌లు, పర్యావరణ అంచనాలు లేకుండా.. అభివృద్ధి ముసుగులో పేదల పొలాలు, నివాసాలను రియల్ ఎస్టేట్ దిగ్గజాలకు కట్టబెట్టడం కాదు.. మూసీ పేరిట కాంగ్రెస్ సర్కార్ చేసే కుట్రలు ఆపకపోతే పుట్టగతులు ఉండవు’ అని మూసీ బాధితులు, పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం ‘మూసీ జన్ ఆందోళన్ ’ పిలుపు మేరకు ఇందిరా పార్ ధర్నా చౌక్ వద్ద మూసీ ప్రాజెక్ట్ బాధితుల ఆక్రోశం మిన్నంటింది. బాపుఘాట్, అత్తాపూర్ నుంచి ఎల్బీనగర్, చాదర్‌ఘాట్ వరకు మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు, రైతులు వేలాదిగా తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండపై రణభేరి మోగించారు.
సిటీబ్యూరో: ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో మూసీ జన్ ఆందోళన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘గత బీఆర్ఎస్ పాలనలో మూసీని శుద్ధి చేసేందుకు 14 కిలోమీటర్ల మేర ఒక ఇల్లు కూడా కూల్చకుండా, ఏ పేదవాని పొట్ట కొట్టకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేశాం. కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నది శుద్ధీకరణను పూర్తిగా పకనబెట్టి, మూసీ ఒడ్డున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కుట్రలు చేస్తోంది. బుల్డోజర్లతో పేదల కలల సౌధాలను కూల్చివేస్తామంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. బాధితులకు అండగా పోరాటంలో ముందుంటుంది’ అని స్పష్టం చేశారు.
అభివృద్ధి పేరిట నగరాల్లో విధ్వంసం
కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ‘గతంలో అభివృద్ధి అనే మాయమాటతో గ్రామాల్లో సహజ వనరులను, రైతుల భూములను నాశనం చేసిన విధ్వంసకర నమూనా, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి విస్తరించింది. అసలు ప్రాజెక్ట్ ఏంటో, దానికి అయ్యే ఖర్చు ఎంతో, పర్యావరణ పర్యవసానాలేమిటో తెలిపే డీపీఆర్ లేకుండా వేల ఎకరాలు, వందలాది నివాసాలు లాకోవడం దారుణం. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఈ నకిలీ సుందరీకరణ ప్రాజెక్టును, అక్రమ కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలి’ అని డిమాండ్ చేశారు.

Hyd1
ప్రధాన డిమాండ్లు ఇవే…
పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి, పీవోడబ్ల్యూ సంధ్య, డీబీఎఫ్ శంకర్, సామాజిక కార్యకర్త సజయ, జీవన్ కుమార్, కన్నెగంటి రవి, సంఘమిత్ర తదితరులు కాంగ్రెస్ సరార్కు పలు డిమాండ్లు ముందుంచారు. సమగ్ర డీపీఆర్‌ను తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేసి 60 రోజుల గడువుతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, వికారాబాద్ నుంచి వాడపల్లి వరకు చట్టబద్ధమైన ‘మూసీ రివర్ బేసిన్ అథారిటీ’ని ఏర్పాటు చేయాలని, ఈటీపీ, ఎస్టీపీలను పకాగా అమలు చేస్తూ పరిశ్రమల విష వ్యర్థాలు నదిలో కలవకుండా చూడాలన్నారు. 1997 నుంచి మూసీ పునరుద్ధరణ పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేసిన తీరుపై పారదర్శకంగా సోషల్ ఆడిట్ చేయాలని ప్రజాప్రతినిధులు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేశారు. అసలు డీపీఆర్ లేకుండా కేంద్రం ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చిందో అర్థం కావడంలేదని విశ్రాంత శాస్త్రవేత్త బాబూరావు విచారణ వ్యక్తం చేశారు. ప్రాజెక్టు డిజైన్లలో కాలుష్య నివారణ అనే పదమే లేకుండా విధ్వంసకర ధోరణితో వ్యవహరిస్తున్నారని పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి మండిపడ్డారు.
కోకాపేటలో కోట్లు.. మా ఇండ్లకు వేలు
ప్రభుత్వ తీరుపై మూసీ బాధితులు, హైదర్ గూడ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కోకాపేట, నార్సింగిలో ప్రభుత్వ భూములను ఎకరం రూ. 250 కోట్లకు విక్రయించే కాంగ్రెస్ సరార్, తరతరాలుగా జీవిస్తున్న తమకు గజానికి రూ. 14,000 నుంచి రూ. 16,000 ఇస్తామనడం దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించారు. ప్రైవేట్ మారెట్ విలువ ప్రకారమే పరిహారం ఇవ్వాలని, లేదంటే భూమికి భూమి కేటాయించాలని నిలదీశారు. రోడ్డు విస్తరణ అని ఒకసారి, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని మరోసారి సర్కార్ బెదిరింపులకు దిగుతుందని, ఎకరం రూ. 60 నుంచి 70 కోట్లు పలుకుతున్న తమ ప్రాంతాల్లో భూములను దౌర్జన్యంగా లాకునే ప్రయత్నాలను అడ్డుకుంటామని బాధితులు స్పష్టం చేశారు.
ప్రజాగ్రహం తప్పదు
మూసీ పునర్జీవనం అంటే కాంక్రీట్ చెక్ డామ్లు, వ్యాపార కట్టడాలు కాదనీ, నది జీవకళను పునరుద్ధరించడమేనని ఈ ధర్నా లో బాధితులు, పర్యావరణవేత్తలు స్పష్టం చేశారు. వేల కోట్ల ప్రజాధనాన్ని రియల్ ఎస్టే ట్ వ్యాపారులకు ధారపోస్తూ, మూసీ తీరం వెంబడి ఉండే వందలాది పేదల కళ్లల్లో నిప్పులు పోసే వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మార్చుకోవాలని స్పష్టం చేశారు. 1997 నుంచి ఇప్పటివరకు మూసీ పునరుద్ధరణ పేరుతో ఖర్చు చేసిన వేల కోట్ల నిధులపై పారదర్శక సామాజిక సర్వే జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల జోలికి వస్తే సచివాలయాన్ని ముట్టడించే స్థాయికి చేరుతుందని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనకి తీసుకోకపోతే ప్రజా క్షేత్రంలో ఘోర పరాభవం తప్పదని మూసీ జనాందోళన్ మరోసారి హెచ్చరించింది.