Hyderabad | వెంగళరావునగర్, ఏప్రిల్ 25 : బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ఓ మహిళ బ్యాగులోని నగదు చోరీ జరిగింది. ఈ ఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అమీర్‌పేట్‌లో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం మణికొండకు చెందిన కె.దివ్య (37) వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమీర్‌పేట్‌లోని రిలయన్స్ బ్యూటీ సెలూన్, వెయిట్ లాస్ సెంటర్‌కు దివ్య వెళ్లారు. పార్లర్‌కు వెళ్లే ముందు ఆమె బ్యాగులో రూ.50 వేలు ఉన్నాయి. దారిలో ఆమె పంజాగుట్టలోని ఐసిఐసిఐ బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేసింది. బ్యాగులో రూ.25 వేలు తీసుకుని వెళ్ళింది. పార్లర్ సోఫాలో ఎప్పటిలాగే బ్యాగు ఉంచి కాసేపటి తర్వాత వెళ్లిపోయారు. పార్లర్‌లోనే తన బ్యాగులో ఉన్న రూ.25 వేలు కాజేశారని.. పార్లర్‌కు నెగిటివ్ రివ్యూలే ఎక్కువగా ఉన్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లర్ నిర్వాహకురాలికి ఫోన్ చేస్తే ఆమె నిర్లక్ష్యంగా నమాధానం చెప్పి దూషించిందని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.