ఆధునీకరణ పనులు వేగం పెంచాలి

సైదాబాద్, జనవరి 18 : కాలనీవాసుల డ్రైనేజీ, తాగునీటి ఇబ్బందులను పూర్తిస్థాయిలో పరిష్కరించాల్సిన బాధ్యత జలమండలి అధికారులదేనని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల అన్నారు. మంగళవారం సాయంత్రం ఎల్సీహెచ్ కాలనీలో రూ.42లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ ఆధునీకరణ పనులను ఆయన ఆస్మాన్‌ఘడ్ జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ ఇబ్బందులను పూర్తిస్థాయిలో తొలగించటానికి రూ.5 కోట్లు కేటాయించటం జరిగిందని, వాటితో పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సైదాబాద్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించటానికి రూ.75 లక్షలు కేటాయించామని, అందులో భాగంగా ఎల్సీహెచ్ కాలనీలో రూ.42 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయన్నారు. కాలనీలో పురాతన పైపులైన్ మూలంగా తరుచూ డ్రైనేజీ పొంగి ఇండ్లలోకి రావటంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తన దృష్టికి తీసుకుని రావటంతో కొత్త అండర్‌గ్రౌండ్ పైపులైన్ నిర్మాణ కోసం నిధులను కేటాయించానని ఆయన తెలిపారు. కాలనీలో ఇండ్ల ఆవరణలో ఉన్న తాగునీటి పైపులైన్లను తొలగించటానికి, కొత్తవి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనులను పూర్తికాగానే, కాలనీ వాసులందరూ కనెక్షన్లు తీసుకోవాలని, వాటి ప్రక్రియ ముగిసిన వెంటనే రోడ్ల నిర్మాణ పనులను చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో ఆస్మాన్‌ఘడ్ జలమండలి డీజీఎం షీలారాణి, సైదాబాద్ జలమండలి మేనేజర్ శ్రవణ్, వర్క్ఇన్స్పెక్టర్ మనోహర్, ఎల్సీహెచ్ కాలనీవాసులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

