పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
జూబ్లీహిల్స్,మార్చి16: పేదలు వివాహాది శుభకార్యాలు చేసుకునేందుకు మోడ్రన్ ఫంక్షన్‌హాళ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రూ.1 కోటి 45లక్షలతో చేపడుతున్న పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. బుధవారం రహ్మత్‌నగర్ డివిజన్ హబీబ్ ఫాతిమానగర్‌లో నిర్మిస్తున్న మోడ్రన్ ఫంక్షన్‌హాల్ నిర్మాణ పనులను కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఫంక్షన్‌హాల్ డిజైన్‌ను జీహెచ్ఎంసీ ఈఈ రాజ్‌కుమార్ ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శులు సుబ్బరాజు, శ్రీనావాస్, నాగరాజు, షరీఫ్, జబ్బార్ పాల్గొన్నారు.
ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ యూనిట్ ప్రారంభం
రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లోని హనుమాన్ స్టోన్ క్రషర్స్ ప్రాథమిక పాఠశాలలో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ యూనిట్‌ను కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ రామలింగయ్య, హెచ్ఎం రామ్‌కుమార్, ఉపాధ్యాయులు రజిత, మీరాంబి,సాలెహ ఉన్నారు.