Rains | హైదరాబాద్ : బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు గచ్చిబౌలిలో 1.4 సెం.మీలు, పటాన్చెరులో 1.3 సెం.మీలు, పాశమైలారంలో 1.2 సెం.మీలు, బీహెచ్ఈఎల్లో 1.2 సెం.మీలు, హఫీజ్‌పేట, మియాపూర్, ఆర్సీ పురంలో 1.1 సెం.మీలు, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, బోరబండ తదితర ప్రాంతాల్లో 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడంతో దాని ప్రభావం వల్ల రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 31.9డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.7డిగ్రీలు, గాలిలో తేమ 89శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.