MMTS | హైదరాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17, 18 తేదీల్లో 24గంటల పాటు నిరంతరాయంగా ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్లో జరిగితే నిమజ్జనం వేడుకలు అంబరాన్ని తాకేలా సాగుతుంటాయి. భారీ వినాయకుల శోభాయాత్రను తిలకించేందుకు నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి జనం వచ్చే విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 17న రాత్రి 11.10 గంటల నుంచి హైదరాబాద్ నుంచి లింగంపల్లి, రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్, 18న అర్ధరాత్రి 12.10 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్నుమా, 18న రాత్రి 12.30 గంటల నుంచి హైదరాబాద్ నుంచి లింగంపల్లికి, 18న ఉదయం 1.50 గంటలకు లింగంపల్లి నుంచి హైదరాబాద్కు, 18న వేకువ జామున 2.20 గంటలకు ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్, 18న వేకువ జామున 3.30 గంటల నుంచి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్, 18న ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కు ఎంఎంటీఎస్ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.