దుండిగల్, నవంబర్ 9: కెనడాలోని ప్రసిద్ధ సాంకేతిక సంస్థ డెటామావెరిక్స్తో దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల యాజమాన్యం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. దుండిగల్‌లోని కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. డెటామావెరిక్స్ ప్రతినిధుల బృందం ఆదివారం ఎంఎల్ఆర్ఐటీ కళాశాలను సందర్శించిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది.
డెటామావెరిక్స్ ప్రతినిధుల బృందం ఎంఎల్ఆర్ఐటీ కళాశాలతోపాటు అరుంధతి వైద్యశాల, మెడికల్ కాలేజీలను సైతం సందర్శించింది. విద్యలో భాగస్వామ్యంతోపాటు డిజిటల్, ఏఐ ఆధారిత సాంకేతికతను విద్యార్థులకు అందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరువర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో క్యాంపస్ రిక్రూట్మెంట్, నైపుణ్యాభివృద్ధి, డేటా ఆధారిత ఆవిష్కరణల్లోనూ పరస్పర సహకారం ఉంటుందని వెల్లడించారు.
అనంతరం డెటామావెరిక్స్ ప్రతినిధుల బృందం ఎంఎల్ఆర్ఐటీ కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈకార్యక్రమంలో డెటామావెరిక్స్ ప్రతినిధులు డిమిత్రి కొంపనీట్స్, బ్రిట్బ్రేకర్, సౌమ్య ఊటుకూరి, శ్రావ్య కాటూరితోపాటు అరుంధతి హాస్పిటల్, ఎయిమ్స్, ఎంఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ డైరెక్టర్ మర్రి ధీరేన్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ కే.శ్రీనివాసరావు, ప్లేస్మెంట్ విభాగాధిపతి రవిచంద్ర, ప్లేస్మెంట్ అధికారి అంజనాసరస్వతి తదితరులు పాల్గొన్నారు.