దుండిగల్ ,ఏప్రిల్ 4: దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల విద్యార్థులు డ్రోన్ డెవలప్మెంట్ పోటీలలో సత్తా చాటారు. ఎస్ ఏ ఈ ఇండియా సదరన్ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఈ పోటీలలోఎంఎల్ఆర్ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో పోటీపడి ద్వితీయ స్థానంలో నిలిచారు. రెగ్యులర్ కేటగిరిలో టిఎన్ఎండి యశస్వి నాయకత్వంలో జటాయు బృందం ద్వితీయ స్థానంలో నిలిచి, రూ45 వేల బహుమతిని గెలుచుకుంది.
మైక్రో కేటగిరీలో ఐలా వినయ్ తేజ నాయకత్వంలో టీం అయోలస్ ఏరో డైనమిక్ విశ్లేషణలో ద్వితీయ బహుమతి సొంతం చేసుకుంది .కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లో ప్రదర్శించిన నిర్వహణ ప్రశంసలు అందుకుంది. కీర్తన నాయకత్వంలో టీం అస్టా్ర, సంకలిష్ట ఇంజనీరింగ్ సవాళ్లను పరిష్కరించడంలో వినూత్న విధానాన్ని ప్రదర్శించి, ఉత్తమ ఆవిష్కరణ విభాగంలో మూడో బహుమతిని గెలుచుకుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో శుక్రవారం విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు.
ఎంఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, విద్యాసంస్థల కార్యదర్శి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ప్రిన్సిపల్ డా.కె ,శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ సెక్రటరీ మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో బహుమతులు సాధించడం చాలా ఆనందంగా ఉందన తెలిపారు . కార్యక్రమంలో కళాశాల ఏరోనాటికల్ విభాగాధిపతి డా .గుప్తా, డీన్ డా. రాధికా దేవి, సాయికుమార్ తదితరులతోపాటు విద్యార్థులు
పాల్గొన్నారు.