వెంగళరావునగర్,సెప్టెంబర్11: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు నిజమైన నివాళి అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ రమణ అన్నారు. గురువారం బీఆర్ఎస్ షేక్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ అధ్యక్షతన షేక్‌పేట్‌లోని భగత్‌సింగ్ కమ్యునిటీ హాల్లో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందించారన్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓటర్లను చేర్పిం చే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ బీఆర్ఎస్కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సొహైల్, జయసింహ పాల్గొన్నారు.