పద్మశాలీలను చైతన్యం చేయాలి
రాష్ట్రంలోని ప్రతి పద్మశాలిని కలిసి చైతన్యం చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. ఆదివారం నారాయణగూడ పద్మశాలి భవన్లో అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- ఎమ్మెల్సీ ఎల్.రమణ
సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ)/హిమాయత్‌నగర్, ఏప్రిల్ 23 : రాష్ట్రంలోని ప్రతి పద్మశాలిని కలిసి చైతన్యం చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. ఆదివారం నారాయణగూడ పద్మశాలి భవన్లో అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజమహల్లా పద్మశాలి భవన్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ ప్రణాళికతో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నూతనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గం ప్రతి పద్మశాలిని చైతన్యవంతం చేయాలని కోరారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్మించిన సహకారంగ వ్యవస్థను పటిష్ట పరచడం కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదించి కార్మికుల సమస్యలు పరిషరిస్తున్నట్లు తెలిపారు. అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి మాట్లాడుతూ.. జూన్ 4న జరిగే పద్మశాలి శంఖారావం సభను విజయవంతం చేయాలని కోరారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. సంఘటితంగా పద్మశాలీలు కదలాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు మాట్లాడుతూ.. బాపూజీ కొనసాగించిన రాజ్ మొహల్లా నుంచే పద్మశాలి సంఘ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
నూతన కమిటీ ఇదే..
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మచ్చ ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా కమర్తపు మురళి కోశాధికారి బొమ్మ రఘురాం నేత, వరింగ్ ప్రెసిడెంట్ మాచర్ల రామచంద్రరావు, యువజన విభాగం అధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటుక రూపతోపాటు అన్ని విభాగాల కార్యవర్గాలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం అఖిలభారత చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు ఎర్రమాద వెంకన్న నేత, మీడియా విభాగం జాతీయ అధ్యక్షుడు అవ్వారి భాసర్, డాక్టర్స్ భాగం జాతీయ అధ్యక్షుడు సోమచంద్రశేఖర్, ప్రొఫెషనల్ అఫీషియల్స్ జాతీయ అధ్యక్షుడు గంగాధర్‌తిలక్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సిలువేరు సునీత, ఇంజినీర్స్ విభాగం అధ్యక్షుడు కాచర్ల రాజకుమార్, గుండేటి శ్రీధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

