e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home హైదరాబాద్‌ సంఘటితంతోనే మహిళల రాణింపు

సంఘటితంతోనే మహిళల రాణింపు

సంఘటితంతోనే  మహిళల రాణింపు
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  •  నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవం 
  •  పలు చోట్ల మహిళలకు సన్మానాలు

శ్రీనగర్‌కాలనీ,మార్చి8: అన్ని రంగాల్లో మహిళలు సంఘటితంగా ముందుకెళ్తూ రాణిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం బంజారాహిల్స్‌లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వేంకటేశ్వరకాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్‌ను ఎమ్మెల్సీ కవిత కట్‌ చేశారు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్‌ భారతీనాయక్‌ ఆధ్వర్యంలో  కేక్‌ కట్‌ చేశారు.ఈ సందర్భంగా మహిళా పట్టభద్రులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు శాంతాబాయ్‌, సోనాబాయ్‌, అనిత,మమత, నాయకులు ఉన్నారు.

మేయర్‌ నివాసం వద్ద..

బంజారాహిల్స్‌,మార్చి 8:జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి నివాసం వద్ద  మహిళా దినోత్సవం ఈ సందర్భంగా సోమవారం మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి మహిళలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. మహిళా పోలీసులను ఏసీపీ సుదర్శన్‌, ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు  అభినందించారు.జూబ్లీహిల్స్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో పలు రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించారు.

మహిళలు ధైర్యంతో ముందుకు సాగాలి 

హిమాయత్‌నగర్‌,మార్చి8: మహిళలు ధైర్యంగా ముం దుకు సాగాలని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి అన్నారు. మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం, మహిళా దినోత్సవాన్నిహైదర్‌గూడలోని మహాసభ రాష్ట్ర కార్యాల యంలో నిర్వహించారు.కార్యక్రమంలో మహా సభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ముదిరాజ్‌, మహిళా విభా గం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి, నా యకురాలు ఉషా,లక్ష్మి, దేవి, లలితా, సంధ్య, పావని, ప ద్మ,జాన్సీ, మంజుల, సునీతదేవి, శ్రీనివాస్‌, సతీష్‌ ఉన్నారు. 

పారిశుద్ధ్య మహిళల సేవలు గొప్పవి…

 కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పారిశుధ్య మహిళా కార్మికులు అందించిన సేవలు గొప్పవని హిమాయత్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ జి.మ హాలక్ష్మీగౌడ్‌ అన్నారు.నారాయణగూడలో 180 మంది పారిశుధ్య మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జి.రామన్‌గౌడ్‌, నర్సింగ్‌గౌడ్‌, ప్రసాద్‌, కవిత, మాధవి, బింధ్యా, జ్యోతిరెడ్డి, శోభరాణి, జైస్వాల్‌, సందీప్‌,ఎస్‌ఎఫ్‌ఏలు ఉన్నారు.

నారాయణగూడ పీఎస్‌లో..

 నారాయణగూడ పీఎస్‌లో మహిళా పోలీస్‌ సిబ్బంది కేక్‌ కట్‌ చేసి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. కార్యక్రమంలో  అబిడ్స్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి,సీఐ రమేశ్‌కు మార్‌,అడ్మిన్‌ ఎస్సై డి.కరుణాకర్‌రెడ్డి పూలబోకేలను అం దించి శుభాకాంక్షలు తెలిపారు.  కార్యక్రమం లో ఎస్సైలు మాధవి, భావ న,మహిళా కానిస్టేబుల్స్‌ జాన్సీ,మందాకిని,భాగ్యలక్ష్మి, ఎం. సరి త,రాజ్యలక్ష్మి వి.హిమజ, శశికల, ఎస్తేర్‌రాణి, ఏలి షా,సువర్ణ,మహేశ్వరి ఉన్నారు.

జాహ్నవి మహిళా కాలేజీలో.. 

 విద్యార్థినీలు ఎంచుకున్న రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జాహ్నవి విద్యాసంస్థల వైస్‌ ఛైర్మన్‌ ఎ.లక్ష్మి సూచించారు.జాహ్నవి మహిళా డిగ్రీ,పీజీ కాలేజీలో సోమవారం మహిళా దినోత్సవం నిర్వహించా రు.విద్యార్థినుల ఆటపాటలు ఆహుతులను అలరించా యి.కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌ భావన, సరిత, కల్యా ణి,టీచింగ్‌,నాన్‌టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

విశ్వేశ్వరయ్యభవన్‌లో..  

ఖైరతాబాద్‌,మార్చి8: ది ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీ ర్స్‌ ఇండియా తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఖైర తాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా  ప్రముఖ సామాజిక వేత్త భారతీయం సత్యవాణి హాజరై మాట్లాడుతూ స్త్రీ లేనిదే సమాజం లేదన్నారు. ఐఈఐ చైర్మన్‌ డాక్టర్‌ జి. రామేశ్వర్‌ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఫౌండేషన్‌ ఫర్‌ ఫ్యూచరిస్టిక్‌ సిటీస్‌ అధ్యక్షురాలు కరుణా గోపాల్‌, ఇంటాక్‌ కన్వీనర్‌ అనురా ధారెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌, టీజీఓ అధ్యక్షు రాలు వి.మమత, టీఎస్‌ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మృ ణాళిని, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ (ప్రాజెక్ట్స్‌) సరోజా రాణి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యురాలు, జేఎన్‌ టీయుహెచ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ. జయలక్ష్మీలను శాలువా, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో ఐఈ ఐ కార్యదర్శి టి. అంజయ్య, సహాయ కార్యదర్శులు ప్రొఫెస ర్‌ జి. రాధాకృష్ణ, డాక్టర్‌ బి. రమణా నాయక్‌పాల్గొన్నారు.

పంజాగుట్ట పీఎస్‌లో ..

 పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. డీఐ నాగయ్య, అడ్మిన్‌ ఎస్సై సతీశ్‌ కుమార్‌ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బంది కేక్‌కట్‌ చేశారు.

Advertisement
సంఘటితంతోనే  మహిళల రాణింపు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement