సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముత్యాలమ్మ ఆలయంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమంటూ.. ఈ వేడుకల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత వెంట సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, మోండా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హరికృష్ణ తదితరులు ఉన్నారు.