హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల .. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. ఇవాళ ఆమె తన ట్విట్టర్లో రోశయ్య మృతి పట్ల స్పందించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు ఆమె ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎన్నో కీలక పదవులను అలంకరించిన రోశయ్య ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని, ఆయన మరణం వారందరిలో తీవ్ర విషాదాన్ని నింపినట్లు ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్లో తెలిపారు. రేపు రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Saddened by the demise of Former Chief Minister of Andhra Pradesh Sri K Rosaiah Garu. My heartfelt condolences to the family and loved ones. His demise has truly left a deep void in the lives of many who he inspired. pic.twitter.com/WjcQ94UeYJ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 4, 2021