
చిక్కడపల్లి, అక్టోబర్ 1: నిరుద్యోగ, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందకు అశోక్ నగర్లోని నగర గ్రంథాలయంలో శనివారం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు నగర గ్రంథాలయం చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి తెలిపారు. జాబ్ మేళాకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం కలిసిన ప్రసన్న ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ, ఈ జాబ్మేళాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కవిత, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యవత కోసం నిర్వహిస్తున్న ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.