
బంజారాహిల్స్, అక్టోబర్ 10: దేశ, విదేశాలకు చెందిన వ్యాపార సంస్థలు, పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిజమ్ ఫర్చిచర్స్ అండ్ మాడ్యులర్ ఇంటీరియర్స్ స్టోర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో అంతర్జాతీయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టారని, టీఎస్ ఐపాస్, సింగల్ విండో అనుమతుల కారణంగా పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందన్నారు. క్రిజమ్ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేనుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నామని, 60 శాతం ఫర్నిచర్‌తో పాటు ఇంటీరియర్ సామగ్రిని ఇక్కడే తయారు చేస్తామని సంస్థ డైరెక్టర్ కిరణ్ పేర్కొన్నారు. తమ సంస్థలో స్థానికులకే ఉద్యోగవకాశాలు కల్పిస్తామని తెలిపారు.