చిక్కడపల్లి, డిసెంబర్ 4: హెచ్ఎండబ్ల్యూ, ఎస్బీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వాటర్ వర్క్స్ ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాల పెంపు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు నాయకులు బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి వినతిపత్రం ఇచ్చారు. యూనియన్ అధ్యక్షుడు పి.నారాయణ, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికులు అనేక ఏండ్లుగా తక్కువ వేతనాలతో తీవ్ర అర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రస్తుతం రూ.13,500 మాత్రమే వేతనం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తమ కోరిక మేరకు జీవో 60/2021 సాధించుకున్నామని, తద్వారా కొంత మేరకు వేతనాలు పెరిగాయన్నారు. అధికారుల తప్పిదం వల్ల అమలు ప్రక్రియ కేటగిరి-2లో చేర్చాల్సిన కార్మికులను, కేటాగిరి-1లో చేర్చారన్నారు.
ఇందువల్ల కార్మికులకు ప్రతినెల దాదాపు రూ.4వేలు తక్కువ వేతనం వస్తుందని వివరించారు. కార్మికులకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్సీని కోరారు. బీఆర్టీయూ నాయకుడు రూప్సింగ్, యూనియన్ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, కుమార్, జగన్, రమేశ్, వీరాస్వామి, సురేశ్, రాములు పాల్గొన్నారు.