హైదరాబాద్ : ప్రజా సంక్షేమంలో పాలకులతో పాటు అధికారుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద(MLA Vivekananda) అన్నారు. రిపబ్లిక్ వేడుకలు పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం వ్యాప్తంగా ఆదివారం మూడు రంగుల జెండా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే కె.పి వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను(National flag) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణల ద్వారా నేడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులపై ఉందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జంట సర్కిల్స్ ఉప కమిషనర్లు నరసింహ, మల్లారెడ్డి, కార్పొరేటర్ రావుల శేషగిరి, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే దూలపల్లి పిఎసిఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ గరిసె నరేందర్ రాజు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈవో టి కృష్ణ తోపాటు పాలక మండల సభ్యులు పాల్గొన్నారు.