MLA Venkatesh | ప్రజల అండదండలతో నియోజకవర్గం అభివృద్ధి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
కాచిగూడ,మార్చి 12: ప్రజల సహకారంతో అంబర్‌పేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెలుతున్నట్లు, పెండింగ్ పనులు పరిష్కరించి, ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాకల డివిజన్లోని అడ్డీ ఖర్కానా ప్రాంతంలో గురువారం రూ.7 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కాలేరు ప్రారంభించారు. అనంతరం డివిజన్లోని పలు బస్తీలలో ఎమ్మెల్యే పర్యటించి బస్తీలో నెలకొన్న స్ట్రీట్‌లైట్, తదితర సమస్యలను స్థానిక ప్రజల నుంచి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంభంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ ప్రజల సహాకారంతో నియోజకవర్గంలోని అన్ని బస్తీ, కాలనీలను అభివృద్ధి చేస్తున్నట్లు, ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల సౌకర్యార్ధం కోసం నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలు పర్యవేక్షించినప్పుడే నాణ్యమైన అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్,డివిజన్ మాజీ అధ్యక్షుడు భరత్ముదిరాజ్,ఆర్కె బాబు,కాలేరు రామకృష్ణ, రెడపాక రాము, సురేశ్‌గౌడ్, శేషు పేరి,కాలేరు రాజు,లక్ష్మిముదిరాజ్,మహ్మాద్ మోబిన్, బాల్‌రాజు, అప్ప శ్రీను, యూసుప్శరీఫ్,తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

