కాచిగూడ,జనవరి 5: ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Venkatesh) అన్నారు. గోల్నాక డివిజన్ శ్యామ్‌నగర్,తదితర బస్తీలలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య పాదయాత్ర నిర్వహించి సమస్యలను తెలుసుకు న్నారు. ఈ సందర్బంగా బస్తీవాసులు కొన్ని రోజులుగా లోఫ్రెషర్ నీటి సమస్య తలెత్తుతుందని, స్పీడ్‌బ్రేకర్లు, సీసీ రోడ్లు వేయాలని, డ్రైనేజీ సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజకవర్గంలో పెండింగ్‌లోని ఉన్న పలు సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తాననని హామీ ఇచ్చారు. ఏ డివిజన్లోనైన డ్రైనేజీ, నీటి సమస్య వచ్చిన వెంటనే అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నియోజకవర్గంలోని డివిజన్లను అభివృద్ధిచేస్తూ, మౌళిక సదుపాయలు కల్పించేందుకు బాధ్యతగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజా సమస్యలను సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. బస్తీలో ఉన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికై కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురేశ్‌గౌడ్, నర్సింగ్‌యాదవ్, బుచ్చిరెడ్డి, ప్రభాకర్ ముదిరాజ్, పడకంటి అంజయ్యచారి, లక్ష్మి ముదిరాజ్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.