హైదరాబాద్ : లష్కర్ బోనాల జాతర (Ujjaini Mahakali Bonalu) వైభవంగా కొనసాగుతున్నది. వేకువ జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం 4 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతించారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు బారులు తీరారు. కాగా, మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. అంతకు ముందు పండితులు తలసానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.