అమీర్పేట్ మార్చి 2 : ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ ఆసరా కమిటీ ఉపాధ్యక్షుగు జెఎస్టీ సాయి, సతీమణి వరలక్ష్మిని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) పరామర్శించారు. ఆదివారం సనత్ నగర్ మోడల్ కాలనీలోని సాయి నివాసానికి కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డితో కలిసి పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధైర్యంగా ఉండాలని త్వరగా కోలుకుంటారని సాయి దంపతులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి డి.పార్థసారథి, ఎస్ఆర్ నగర్ వైయోధిక మండలి ప్రతినిధులు రాములు, అనంతరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.