బేగంపేట్ సెప్టెంబర్ 23 : పాటిగడ్డ బస్తీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తానని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Talasani Srinivas Yadav) హామీ ఇచ్చారు. బేగంపేట్ డివిజన్లోని ఎన్బీటి నగర్ పాటిగడ్డ బస్తీకి(Patigadda Basti) నూతనంగా బస్తీ అధ్యక్షుడిగా ఎన్నికైన శేఖర్ ముదిరాజ్ సోమవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను బస్తీ ప్రజలతో వచ్చి వెస్ట్ మారేడ్‌పల్లిలోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
శేఖర్‌ను ఎమ్మెల్యే శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బస్తీ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. బస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు అఖిల్, రఫీక్, ఆరీఫ్, ఇలియాజ్, సిద్ధిక్, నసీమా, శారద, అమ్ములు, తదితరులు పాల్గొన్నారు.