బేగంపేట్, ఆగస్ట్ 15 : శాఖాహారమే ఆరోగ్యానికి శ్రేయస్కరమని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని ప్యాట్ని సెంటర్ వద్ద నుండి పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శాఖాహారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక పోషక విలువలు కలిగిన ఆకు కూరలు, పండ్లతో మంచి ఆరోగ్యం లభిస్తుందని, కల్తీ ఆహారం తిని అనారోగ్యానికి గురికావొద్దని అన్నారు. ఈ ర్యాలీలో మాజీ కార్పొరేటర్ అరుణ గౌడ్, నిర్వాహకులు కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కిశోర్, ఆంజనేయులు, నాగులు, సంజయ్ పాల్గొన్నారు.