బేగంపేట్ ఏప్రిల్ 4: సనత్‌నగర్(Sanathnagar) నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ(BRS party) సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 6 వ తేదీన (శనివారం)9.30 గంటలకు వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Talasani) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధి పద్మారావుగౌడ్ హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి సనత్‌నగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
రేపు బేగంపేట్‌లో..
కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఆధ్వర్యంలో శుక్రవారం బేగంపేట్‌లోని మయూరి మార్గ్‌లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.