బేగంపేట్, నవంబర్ 15 : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Talasani )పేర్కొన్నారు. బేగంపేట్ డివిజన్ ఎయిర్పోర్ట్ కాలనీ(Airport colony) అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కాలనీలో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న పార్కు, రోడ్ల నిర్మాణాలను చేపట్టడంలో సహకరించిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఎయిర్ పోర్ట్ కాలనీలో తాగు నీటిని సమస్యను పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన తలసాని ఎయిర్పోర్ట్ కాలనీ తాగు నీటి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయమై వెంటనే క్షేత్ర స్థాయిలో సమస్యను పరిశీలించి పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత జలమండలి అధికారులను ఎమ్మెల్యే ఫోన్‌ద్వారా ఆదేశించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్, కార్యదర్శి గోపాల్, రూప్‌కుమార్, పీబీఎన్ రెడ్డి, కోటేశ్వర్రావు తదితరులున్నారు.