బేగంపేట్ డిసెంబర్ 7 : ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున ఆర్థిక సహాయం విడుదల కాగా మంజూరు పత్రాలను లబ్ధిదారుల కుటుంబాలకు అందజేశారు. సనత్‌నగర్‌కు చెందిన సంగీత, నందినిలకు ఈ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ బీఆర్ఎస్ నాయకులు బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.