బన్సీలాల్‌పేట్, ఆగస్టు 26 : సనత్ నగర్ నియోజకవర్గంలోని పార్కుల(Parks) అభివృద్దికి తాను కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. సోమవారం పద్మారావునగర్‌లోని జీహెచ్ఎంసీ పార్కు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసారు. పార్కులో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి వారు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కు అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశిస్తానని తెలిపారు. తాను గెలిచాక పార్కులో సకల సౌకర్యాలను కల్పించానని గుర్తు చేసారు.
ఇటీవల పార్కుకి వస్తున్న వాకర్ల సంఖ్య పెరిగిందని, అందుకు తగిన విధంగా సదుపాయాలను కూడా కల్పించినట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వాకర్స్ అసోసియేషన్ ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన సూచించారు. పార్కు అభివృద్దికి తాను సహాయ సహకారాలను అందిస్తానని ఆయన వారితో అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి బాల్‌రెడ్డి, ఉపాద్యక్షుడు చక్రధర్ యాదవ్, సభ్యులు కృష్ణారావు, జీకే.రావు, బన్సీలాల్‌పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, నాయకులు ముక్క శ్రీనివాస్, గజ్జెల శ్రీను, సురేశ్, వినోద్, వెంకట్, సుధాకర్ రెడ్ది తదితరులు పాల్గొన్నారు.