హైదరాబాద్ : కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు..దోచుకొని దాచుకుంటున్న దోపిడీ ప్రభుత్వం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తలసాని పాల్గొని మాట్లాడారు. హైడ్రాను తీసుకొచ్చి వేలాది ఇండ్లను కూల్చారని మండిపడ్డారు. పేదలు, బాధితులు ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు రాలేదన్నారు.
బూతు మాటలే ఏకైక మార్గం అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు.
ప్రజల మన్ననలను పొందితేనే నాయకులుగా ఎదుగుతారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చరిత్ర ఉన్నంతకాలం ఉంటారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాలలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.