హైదరాబాద్ : ప్రభుత్వం, అధికారుల బాధ్యత రాహిత్యంతోనే రామాంతపూర్‌లో ఆరుగురి మృతి చెందారని
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విద్యుత్ షాక్ ఘటన జరిగిన రామంతపూర్‌లో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ హబ్సిగూడ, ఓల్డ్ రామం తపూర్లలో మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుల మృతి చాలా బాధాకరం అన్నారు. అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ప్రమాదం జరిగిన తర్వాత ఆఘమేఘాల మీద విద్యుత్ తీగలను మార్చారన్నారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు.