హైదరాబాద్ : పేద, మధ్య తరగతి కుటుంబాల మేలు కోసమే కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), శాదీముబారక్ పథకాలను నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Taalasani Srinivas Yadav) అన్నారు. బుధవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 159 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, శాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం అందజేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి ప్రజలు ఓటు వేశారన్నారు. గతంలో ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజల కలిసి ఉద్యమిస్తామన్నారు. ఆరు గ్యారం టీలను అమలు చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ర్ఈక్ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు
ఉన్నారు.