MLA Sudhir Reddy | గుడిసెవాసులకు పునరావాసం కల్పిస్తాం : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
MLA Sudhir Reddy | రోడ్డు విస్తరణలో గుడిసెలు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (MLA Sudhir Reddy) అన్నారు.
ఎల్బీనగర్( హైదరాబాద్ ) : రోడ్డు విస్తరణలో గుడిసెలు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (MLA Sudhir Reddy) అన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హయత్‌నగర్(Hayatnagar) రేడియో స్టేషన్ ప్రధాన రహదారిపై నివసిస్తున్న వారి గుడిసెలను తొలగించడం పట్ల ఎమ్మెల్యే గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు.
గతంలో ఆటోనగర్ క్రీడా ప్రాంగణం వద్ద ఉన్న సమయంలో గుడిసె వాసుల సమస్యలను పరిష్కరించానని గుర్తు చేశారు. ఆటోనగర్‌లో అంతర్జాతీయ బస్ టెర్మినల్(Bus terminal) ప్రతిపాదనలో భాగంగా గుడిసెవాసులను హయత్‌నగర్ రేడియో స్టేషన్ వద్దకు తరలించారని తెలిపారు. రేడియో స్టేషన్ వద్ద కరెంటు సౌకర్యం, మూత్రశాలలు, మంచినీరు,వీధి దీపాలు , వీధి వ్యాపారుల లైసెన్స్‌లు ఇప్పించామన్నారు. జాతీయ రహదారి విస్తరణలో గుడిసెలు తొలగిస్తే వారికి పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతానని పేర్కొన్నారు. గుడిసెవాసులను న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

