నేరేడ్మెట్, జూన్ 12: మల్కాజిగిరి నియోజకవర్గంలో నెలకొన్న మంచినీరు(Drinking water), డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు. బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ కుమార్‌ను(Jalmandali GM) కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో తాగునీరు, డ్రైనేజీల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అంతేకాకుండా బహుళ అంతస్తులకు డ్రైనేజీ తాగునీరు, మౌలిక సౌకర్యాలు లేకుండా అనుమతులు ఏవిధంగా ఇస్తారని జలమండలి మేనేజర్‌ను ప్రశ్నించారు. ముఖ్యంగా కౌకూర్ రాజీవ్ గ్రుహకల్ప వాసులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు భాస్కర్, సాంబయ్య, అశ్రిత, మేనేజర్లు మల్లికార్జున్, లోక్‌సభ నియోజవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్, అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి, సబిత అనిల్ కిషోర్, మేకల సునితా రాముయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.