మణికొండ/శంషాబాద్ రూరల్, అక్టోబర్ 19 : బతుకమ్మ పండుగ విశిష్టతను భావితరాలకు తెలియజే యాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ కేబీఆర్ పార్కులో బుధవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ, కోలాటం ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాతే బతుకమ్మ పండుగకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.
ప్రపంచంలో అందరూ పూలతో పూజలు చేస్తే తెలంగాణ ప్రజలు మాత్రం పువ్వులకే పూజలు చేస్తారని పేర్కొన్నారు. వేడుకల్లో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్‌గౌడ్, శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, నార్సింగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కె.రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు లావణ్య, కావ్య, వసంత్చౌహాన్, మీనా, పద్మారావు, శ్వేత, కోఆప్షన్ సభ్యురాలు లక్ష్మి, మాజీ సర్పంచ్‌లు వై.నరేశ్, లక్ష్మమ్మ, బీఆర్ఎస్ బి.శ్రీరాములు, నాయకులు మహేశ్, లక్ష్మయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి 1వ వార్డులో గురువారం బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. నార్సింగి మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ మమతాశ్రీనివాస్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడారు. అనంతరం చైర్సర్సన్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో బతుకమ్మ ఒక భాగమై నాలుగు కోట్ల ప్రజల బతుకు చిత్రాన్ని మార్చిందని వివరించారు. బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ప్రపంచదేశాలకు విస్తరించారని వివరించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కోఅప్షన్ సభ్యురాలు సంతోషి, బీఆర్ఎస్ నాయకులు మంచర్లశ్రీనివాస్, ప్రభాకర్, రాజేందర్, జీబీ సుభాష్, స్టాచిస్, రమేశ్, భాస్కర్, కిశోర్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంత రం స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మెప్మా కార్యాలయం ఎదుట మహిళా సంఘాల సభ్యులు గురువారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలతో ఆడి పాడారు