గౌతంనగర్, అక్టోబర్ 22: నేరాలను అదుపుచేయడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గౌతంనగర్ డివిజన్ గోపాల్‌నగర్‌లో శుక్రవారం సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేరాలు జరిగినప్పుడు దుండగులను గుర్తించి పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందని అన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేశామని, అవసరమైన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారని తెలిపారు. కాలనీల సంక్షేమ సంఘాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీతారాము యాదవ్, రాముయాదవ్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, రాజు, మధుసూదన్, కేఎస్ మూర్తి, రాజేంద్రకుమార్, భాస్కర్, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి, అక్టోబర్ 22: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మచ్చ బొల్లారం డివిజన్ బటన్‌గూడ వద్ద రూ.29 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాలనీల్లో సీసీ రోడ్డు, బీటీ రోడ్లు వేయడం పూర్తయిందని తెలిపారు. మరోసారి అధికారులతో సర్వే నిర్వహించి అవసరమైన కాలనీల్లో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ నాగమణి, ఈఈ రాజు, డీఈలు మహేశ్, రవళిక, కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ లోకసాథం, సురేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, శోభన్‌బాబు, వెంకటేశ్‌గౌడ్, దేవేందర్, జ్యోతి, దేవిక, కవిత, సులోచన తదితరులు పాల్గొన్నారు.
గౌతంనగర్, అక్టోబర్ 22: టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గౌతంనగర్‌కు చెందిన గణేశ్ ముదిరాజ్‌కు ఎమ్మెల్యే నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేకల రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.