మల్కాజిగిరి, అక్టోబర్ 21: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మౌలాలి డివిజన్, ఆర్టీసీ కాలనీలో ఎమ్మెల్యే పాదయాత్రచేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. సీసీ రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, స్ట్రీట్ లైట్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అధికారులతో సర్వే నిర్వహించి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి.. పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అమలు పరుస్తుందని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగు లకు నెలనెలా పింఛన్ అందజేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. పింఛన్‌దారుల వయసును 57కు తగ్గించారని అన్నారు. అర్హులైన వారిని గుర్తించి.. వారి పేర్లను అధికారులు తెలపాలన్నారు. పేద ఆడపిల్ల పెండ్లికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకంలో రూ.1,01,116ల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ కౌశిక్, పిట్ల శ్రీనివాస్, సతీశ్‌కుమార్, అమినుద్దీన్, సత్తయ్య, భాగ్యానందరావు, సాదిక్, ఆదినారాయణ, జగదీశ్‌యాదవ్, ఇబ్రహీం, భాస్కర్, రాందాస్, కాలనీవాసులు మహమ్మద్ నౌరుద్దీన్, లక్ష్మీనారాయణ, చిరంజీవి, సైఫ్, తదితరులు పాల్గొన్నారు.