మల్కాజిగిరి, అక్టోబర్ 18: వరద ముంపు నివారణకు బాక్స్ డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం ఈస్ట్ ఆనంద్‌బాగ్ షిరిడీనగర్‌లో బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేశా మని అన్నారు. వర్షాల వల్ల నిర్మాణ పనుల్లో కొంత ఆలస్యం జరిగింద ని, ప్రస్తుతం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని అన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో డీఈ లౌక్య, కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, పిట్ల శ్రీనివాస్, నిరంజన్, రాముయాదవ్, బాబు, సత్యనారాయణ, సత్యమూర్తి, నరేశ్‌కుమార్, నవీన్‌యాదవ్, గద్వాల జ్యోతి,సంతోశ్, రాందాస్, శ్రీధర్ పాల్గొన్నారు.
గౌతంనగర్, అక్టోబర్ 18 : బాక్స్ డ్రైనేజీతో నాలాల సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం గౌతంనగర్ డివిజన్, న్యూ మిర్జాలగూడ చిన్మయి స్కూల్ లైన్ వద్ద నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. నాలాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని.. దీనికి శాశ్వత పరిష్కారంగా రూ.1.60కోట్లతో బాక్స్ డ్రైనేజీ నిర్మాణా నికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ప్రతిపాదన లు పరిశీలించి నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభి స్తామని అన్నారు. కార్యక్రమంలో డీఈ లౌక్య, ఏఈ దీపక్, కార్పొరేట ర్ మేకల సునీతారాముయాదవ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.