వినాయక్‌నగర్, అక్టోబర్ 3: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి స్వచ్ఛందంగా వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం వినాయక్‌నగర్ డివిజన్, అంబేద్కర్‌నగర్ బస్తీలో వివిధ పార్టీల నుంచి నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నదని అన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ కోసం పని చేసేవారికి సరియైన గుర్తింపు ఉంటుం దని అన్నారు. కార్యక్రమంలో యాదగిరి, స్వామియాదవ్, రమేశ్, పరశురాంరెడ్డి, శ్రీనివాస్, ఫరీద్, బాలకృష్ణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.