వినాయక్‌నగర్, సెప్టెంబర్ 12: అల్వాల్ సర్కిల్ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం అల్వాల్ సర్కిల్లోని కాలనీ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. మండపంలో పూజలు నిర్వహించిన అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్వాల్ సర్కిల్ పరిధిలోని అన్ని కాలనీల్లో ఇప్పటికే సీసీ, బీటీ రోడ్లు, యూజీడీ నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు. వినాయకుడి మండపాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతీశ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, మాజీ కో ఆప్షన్ మెంబర్ జ్యోతిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, కొండల్‌రెడ్డి, సరేందర్రెడ్డి, నాగేశ్వరరావు, రాజసింహారెడ్డి, బల్వంత్‌రెడ్డి, బబిత, కవిత పాల్గొన్నారు.
మల్కాజిగిరి, సెప్టెంబర్ 12: మల్కాజిగిరి పరిధిలోని సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్, బండచెరువు నిమజ్జన కొలనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పాటు కార్పొరేటర్లు ఆదివారం పరిశీలించారు. నిమజ్జన కొలనులో పాత నీరు తొలగించి కొత్తనీటిని నింపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బండ చెరువులోని వినాయక నిమజ్జన కొలనును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఆనంద్‌బాగ్‌లోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విష్ణురూప గణపతిని దర్శించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేంకుమార్, సునీతయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, నాయకులు బద్దం పరశురాంరెడ్డి, పిట్టల శ్రీనివాస్, జీఎన్వీ సతీశ్‌కుమార్, నిరంజన్ పాల్గొన్నారు.