గౌతంనగర్, సెప్టెంబర్ 11: నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం భరత్‌నగర్ బస్తీ అధ్యక్షుడు మంద భాస్కర్ ఆధ్వర్యంలో బస్తీవాసులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భరత్‌నగర్‌లోని 10గల్లీలు, కమ్యూనిటీహాల్ మొదటి అంతస్థు నిర్మాణం చేపడుతామని అన్నారు. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలు అర్హులందరికీ అందేలా అసోసియేషన్ ప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని తెలిపారు. అనంతరం భరత్‌నగర్ అధ్యక్షు డు మంద భాస్కర్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు భా గ్యానందరావు, ఎండీ సాధిక్, బుద్ధి నర్సింగ్‌రావు, చంద్రకాంత్, రాజు, జాన్‌బీ, భరత్‌నగర్ అసోసియేషన్ సభ్యులు కృష్ణ, సునందరావు, హన్మంతరావు, నర్సింగ్, ఐలయ్య, లలిత, నాగరాజు, వెంకట్, నాగలక్ష్మి పాల్గొన్నారు.