మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పాదయాత్రల ద్వారా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ జవాబుదారీగా పని చేస్తున్నట్లు చెప్పారు.
- ఎమ్మెల్యే ముఠా గోపాల్
- రాంనగర్ డివిజన్శాస్త్రీనగర్లో పర్యటన
ముషీరాబాద్, డిసెంబర్ 28: బస్తీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. పాదయాత్రల ద్వారా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ జవాబుదారీగా పని చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఆయన రాంనగర్ డివిజన్ శాస్త్రీనగర్లో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. నేరుగా బస్తీవాసులను కలుసుకొని స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ బస్తీలో డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ నిర్మాణాలు చేపట్టిన తరువాత రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శాస్త్రీనగర్లో ప్రస్తుత రోడ్డు గుంతలమయంగా మారిన నేపథ్యంలో నూతన రోడ్డ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
స్థానికుల విజ్ఞప్తి మేరకు డ్రైనేజీ, తాగునీటి పైపులైప్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించి అవసరమైతే వెంటనే కొత్త పైపులైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బస్తీల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణను గాడిలో పెట్టాలని ఆ విభాగాల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా పాదయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఏఈ మురళీ, దాసు నాయక్, జలమండలి డీజీఎం దిలీప్, బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, రావులపాటి మోజస్, ఎర్రం శేఖర్, సంపూర్ణ, దామోదర్రెడ్డి, నాగభూషణం, దీన్దయాల్రెడ్డి, సందీప్, అరుణ్, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీకాంత్, నవీన్, వినీత్, ప్రశాంత్మధు, శంకర్ పాల్గొన్నారు.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
చిక్కడపల్లి,డిసెంబర్28 మత్స్య కారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తోందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చారని పేర్కొన్నారు.చిక్కడపల్లి గంగపుత్ర బెస్త సంఘం, గాంధీనగర్ మహిళా మత్య్స పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్ జవహర్నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఫిష్ స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాల్ను ప్రారంభించి ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. సీఎం కేసీఆర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నా రన్నారు. సంఘం అధ్యక్షుడు గుండు జగదీశ్ బాబు మాట్లాడుతూ స్టాల్కు విశేష స్పందన వస్తుందన్నా రు.మత్స్య భవన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మత్స్య శాఖ ఆధ్వర్యంలో మహిళలకు చేపల వంటల తయారీ పై శిక్షణ ఇచ్చి వారికి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గుండు జగదీశ్ బాబు, మాజీ కార్పొరేటర్ అరుణ జయేందర్ బాబు,మాజీ చైర్మన్ కొప్పు పద్మ, గాంధీనగర్ మహిళా మత్య్స పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు పెద్దపల్లి సుజాత, నాయకులు సుమలత,ధనలక్ష్మి, పద్మ, భారతి, శివరంజని, ఉమాదేవి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

