కవాడిగూడ, ఏప్రిల్ 4: దేశంలోనే ఎక్కడలేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ అడబిడ్డలకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ముషీరాబాద్ చౌరస్తాలోని మహ్మదీయ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అదే విధంగా 58 జీవో కింద మంజూరైన ఇండ్ల పట్టాలను ఆయన ముషీరాబాద్, కవాడిగూడ, రాంనగర్ డివిజన్ల కార్పొరేటర్లు సుప్రియా నవీన్‌గౌడ్, గోడ్చల రచనశ్రీ, రవిచారి, తాసీల్దార్ హియత్నగర్ డిప్యూటీ తాసీల్దాతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నామని అన్నారు. నియోజక వర్గంలో కొత్తగా మంజూరైన 202 షాదీ ముబారక్, 34 కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసినట్లు తెలిపారు
. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్, 58 జీఓ కింద 226 మంది ధరఖాస్తులు చేసుకోగా ఇద్దరికి ఇండ్ల పట్టాలు అందజేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ముషీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు వల్లాల శ్యామ్ యాదవ్, ఆర్. మోజెస్, ఎం. రాకేశ్ కుమా ర్, నర్సింగ్ ప్రసాద్, శ్రీనివాస్ గుప్తా, ఎ. శంకర్ గౌడ్, శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, మహ్మద్ అలీ. వల్లాల శ్రీనివాస్ యాదవ్, ఆర్. శ్రీనివాస్, సోమన్, రహీం, కల్యాణ్, జి. వెంకటేశ్, మహేశ్, మాధవి, మంజుల, రూప తదితరులు పాల్గొన్నారు.
సీవరేజీ డ్రైన్ పైపులైన్ నిర్మాణ పనులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడలోని రామకృష్ణ మఠం నుంచి కట్టమైసమ్మ టెంపుల్ వరకు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వరద నీటిని అరికట్టడానికి రూ. 21 లక్షల వ్యయంతో సీవరేజీ డ్రైన్ పైపులైన్ నిర్మాణ పనులను ఆయన స్థానిక కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, మాజీ కార్పొరేటర్ టి. రవీందర్, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, జీహెచ్ఎంసీ డీఈ సన్ని, ఏఈ బి. సుభాష్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని, అందులో భాగంగానే ప్రజలకు ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా సీవరేజీ డ్రైన్ పైపులైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు.
ముఖ్యంగా ఈ ప్రాంతంలో అంతర్గతంగా టెలిఫోన్ కెబుల్ వైర్లు, రా వాటర్ లైన్లు, తాగునీటి లైన్లు ఉన్నందున పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని అన్నా రు. ఇందిరా పార్కులో 25 ఏండ్ల నుంచి తాగునీటి సమస్య ఉన్నదని త్వరలోనే మూడు నల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్లను రిపేర్ చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, కల్వ గోపీ, బల్లేకారి రమేశ్, మధు, రాంచందర్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, బి. విశ్వనాథ్, సుధాకర్ యాదవ్, వల్లాల రవి యాదవ్, శ్రీహరి, ఆర్. రాజేశ్, కరికె కిరణ్, ప్రవీణ్ గౌడ్, విక్కీ, మహేశ్, సందీప్, శ్రీధర్‌రెడ్డి, బాలయ్య, యాదగిరి, మాధవి, జి. వెంకటేశ్, ఎం. రమేశ్‌రామ్, మహేందర్ బాబు, పరిమళ్‌కుమార్, ప్రభాకర్, దిలీప్ యాదవ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.