చిక్కడపల్లి, మార్చి 9: బీఆర్ఎస్(BRS) పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బీఆర్ఎస్ రాంనగర్ డివిజన్ బూత్ స్థాయి కమిటీ సమావేశం ఆదివారం రాంనగర్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.
మహిళా దినోత్సవం పురస్కరించుకొని పలువురు మహిళా నాయకులను కార్యకర్తలను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిశీలకు కొండపల్లి మాధవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మన్నె దామోదర్ రెడ్డి, నాయకులు వి. ఇంద్రసేన రెడ్డి, ముదిగొండ మురళి, ఎర్రం శేఖర్, కళ్యాణ్ నాయక్, గోక నవీన్, ఆర్. జైదేవ్, టీ వి రాజు, సాబీర్ , సత్యనారాయణ, పి.విజయకృష్ణ, సందీప్ గండు వెంకటేష్, సునీల్, రాజేష్, అమర్.శ్రీ కాంత్, వై. వెంకటేష్ గుప్త, కల్పన సాలమ్మ, తులసి, మంజుల, మేరీ,లక్ష్మి, అనురాధ, శ్రీలతర లక్ష్మీదేవిర తదితరులు పాల్గొన్నారు.