శామీర్‌పేట: నిరుపేదలు, మధ్యతరగతి కార్మికుల కష్టార్జితంతో కార్పొరేట్ కంపెనీలు చెలగాటమాడటం సరికాదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం హెచ్‌బీఎల్ కంపెనీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సుమారు 4,000 మంది కార్మికులు, ప్రభుత్వం జారీ చేసిన జీఓ మేరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ఎదుట ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కార్మికుల వద్దకు చేరుకొని తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులకు అండగా ఉంటానని చెప్పారు.