మల్కాజిగిరి, జూన్ 9: కాలేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ర్టానికి జలహారమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేయడంతో సంఘీభావంగా అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్‌కు ర్యాలీగా వెళ్లారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో బోయిన్పల్లి కార్యాలయం నుంచి తెలంగాణ భవన్‌కు ర్యాలీ తీశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు ఉద్యోగాలంటూ పోరాటం చేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావును విచారణకు పిలవడం సిగ్గుచేటని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.