మల్కాజిగిరి, జూలై 11: మల్కాజిగిరి నియోజకవర్గంలో మాస్టర్ ప్లాన్‌ను సవరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. శనివారం బేగంపేటలోని హెచ్ఎండీఏ కార్యాలమంలో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఎమ్మెల్యే కలసి వినతిపత్రం అందశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కౌకూర్‌లోని సర్వే నంబర్లు 11, 35, 50, 56 పరిధిలోని శ్యామల, లక్ష్మీనగర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, విలాస్ స్ప్రింగ్ కాలనీలపై ప్రభావం చూపుతున్న హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లోని 60 మీటర్ల ప్రతిపాదిత రహదారిని తొలగించాలన్నారు. దీంతో స్థల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గౌతంనగర్ డివిజన్లోని మిర్జాలగూడ పరిధిలోని మిర్జాల్‌గూడ- చన్మయ మార్గ్ రోడ్డులో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లోని 60 అగుడుల రోడ్డుని 30 అడుగులకు కుదించారన్నారు. దీంతో ప్రజలు తమ స్థలాల వినిమోగం, నిర్మాణ అనుమతులు, అభివృద్ధి పనులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. కాలనీయనగర్ డివిజన్ పరిధిలోని ఏఎన్రావు నగర్ నుంచి నేరేడ్మెట్ వరకు ఏఎస్ రావు నగర్ నుంచి సాయినాధ్పురం, జేకే కాలనీ, సమతానగర్, కాకతీయనగర్ల నుంచి ప్రతిపాదించిన 100 అడుగుల రహదారిని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని కోరారు. సీఆర్ఎంపీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటానని హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ హామీ ఇచ్చారని తెలిపారు.